కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ పాఠశాల ఆధ్వర్యంలో.. దివ్యంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కాగజ్ నగర్ తహసీల్దార్ ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా ఈకార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ కు మందు లేదని.. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడమే.. కరోనా మందు.! - Distribution of Essential Commodities in Kagaznagar Town
జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా దూరమవుతుందని తహసీల్దార్ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో దివ్యాంగులకు, స్థానికులకు నిత్యావసర సరకులు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడమే.. కరోనా మందు.
కరోన వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారని.. అలాంటి వారికి దాతలు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని తహసీల్దార్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు మాస్క్ ధరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్‌పై పంజా విసురుతున్న కరోనా