తెలంగాణ

telangana

ETV Bharat / state

మోకాళ్ల మీద కూర్చుని విద్యావాలంటీర్ల నిరసన - COLLECTORATE COMPLEX

విద్యా వాలంటీర్లు చేస్తున్న ధర్నా కుమ్రం భీం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 12 నుంచి ప్రారంభం అయ్యే పాఠశాల తరగతులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. బకాయిలు చెల్లించే వరకు పాఠశాలలకు వెళ్ళేది లేదని భీష్మీంచారు.

మమ్మల్ని యథావిధిగా కొనసాగించాలి : విద్యా వాలంటీర్లు

By

Published : Jun 10, 2019, 8:54 PM IST

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు పాలనాధికారి కార్యాలయం ఎదుట జిల్లాలోని విద్యా వాలంటీర్లు మోకాళ్ళపై కూర్చుని విన్నూత్న నిరసన చేపట్టారు. విద్యా వాలంటీర్లకు 4 నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించే వరకు ధర్నాను విరమించేది లేదని పాలనాధికారి కార్యాలయం ముందు భీష్మించి కూర్చున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నందున సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లను కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉప పాలనాధికారి రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు.

బకాయి వేతనాలు చెల్లించకపోతే విధులు బహిష్కరిస్తాం : విద్యా వాలంటీర్లు
ఇవీ చూడండి : సెలైన్ బాటిల్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details