కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డా. పాల్వాయి హరీశ్ బాబును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ మండలం కొత్త సారసాలలో అటవీ అధికారులపై తెరాస నాయకుల దాడిపై కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొత్త సారసాలలో పర్యటిస్తుందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పాల్వాయి హరీశ్ ముందస్తు అరెస్ట్ - congress
సిర్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జీ డా.పాల్వాయి హరీశ్ బాబును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కుమురం భీం జిల్లా కొత్త సారసాలలో హస్తం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తుందన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
హరీశ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు