తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి - komurama bheem asifabad

ఓ యువకుడిని పాము కాటేసింది..108కి ఫోన్ చేస్తే డ్రైవర్ లేదని సమాధానం. ఎలాగో అలా ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ లేడు. వేరేచోటికి తీసుకెళ్దామంటే ప్రభుత్వ అంబులెన్స్​లో డీజిల్ లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి

By

Published : Jun 8, 2019, 3:20 PM IST

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలితీసుకొంది. పాటిబండ గ్రామపంచాయతీ వద్ద వాగు కాలనీలో 22 ఏళ్ల శంకర్​కు పాము కాటేసింది. వెంటనే 108కి ఫోన్ చేస్తే డ్రైవర్​ లేడని చెప్పారు. సొంత వాహనంపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడా డాక్టర్ లేడు. నర్సులు ప్రథమ చికిత్స అందించి.. మంచిర్యాలకు తీసుకువెళ్లమని సూచించారు. ప్రభుత్వ అంబులెన్సులో తరలించడానికి ప్రయత్నించగా.. డీజిల్​ లేదని డ్రైవర్​ తెలిపాడు. బాధితుని కుటుంబీకులే అంబులెన్స్​లో డీజిల్ కొట్టించి మంచిర్యాలకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనతో రహదారిపై మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న రోగాలకు కూడా.. మంచిర్యాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొత్త వైద్యులను నియమించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: అమ్మాయి కోసం స్నేహితుల గొడవ..ఆత్మహత్య..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details