సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలంటూ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కని..అది ప్రభుత్వ భిక్షం కాదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ.. ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని 1 లక్ష 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు సామాజిక భద్రత పట్ల దినదినం ఆందోళన చెందుతూ ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి'
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
'పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి'