తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2020, 3:28 PM IST

ETV Bharat / state

రోడ్డు విస్తరణలో ఎడతెగని జాప్యం.. జనానికి తప్పని తిప్పలు

అధికారుల నిర్లక్ష్యం, జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్​లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆపేశారు. ఇప్పుడు ఆ చర్యలతో స్థానికులు, విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు.

రోడ్డు విస్తరణలో ఎడతెగని జాప్యం.. జనానికి తప్పని తిప్పలు..
రోడ్డు విస్తరణలో ఎడతెగని జాప్యం.. జనానికి తప్పని తిప్పలు..

రోడ్డు విస్తరణలో ఎడతెగని జాప్యం.. జనానికి తప్పని తిప్పలు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకు నుంచి చెక్ పోస్ట్ వరకు రహదారి విస్తరణ పనులు మూడు నెలల కిందట ప్రారంభించారు. రోడ్డుని తవ్వి కంకర వేశారు. మధ్యలో విభాగిని ఏర్పాటు చేశారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నందున తవ్విన రోడ్డుతో ప్రయాణికులు, పట్టణ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

దుమ్ముతో అవస్థలు..

రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు జరిపి రహదారిపై కంకర వేశారు. మరోవైపు వాహనాలు వెళ్తున్న సమయంలో విపరీతమైన దుమ్ము రావడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆంధ్ర బ్యాంకు ఎదుట కంకర పోవడం వల్ల బ్యాంకుకు వెళ్లే దారి మూసుకుపోయింది. బ్యాంకు, కళాశాల, వ్యాపార భవనాలు, దుకాణాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details