రెండో విడతలో నిర్వహించనున్న ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి వివిధ గ్రామల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు అయ్యాయి. మొదటి రోజు 10 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు.
రెండో రోజు 22 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. మూడోరోజు అధికంగా 34 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. మొత్తంగా 15 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం !! - KUMURAM BHEEM ASIFABAD
స్థానిక సంస్థల ఎన్నికలకు చివరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం
ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య