కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మండలంలోని లైన్గూడాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఫౌండేషన్ సభ్యుల చేతులమీదుగా.. పేదలకు దుప్పట్లు, దుస్తులను పంపిణీ చేశారు.
ఆదివాసీలకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ - ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆదివాసీలు డప్పు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
ఆదివాసీలకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ
చేతన ఫౌండేషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. జిల్లాలోని పరిస్థితులను తెలుసుకుని, పేదలకోసం వారు ఇంత దూరం రావటం ఆనందంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో ఆర్.ఎస్. చిత్రు, ఎమ్మార్వో ప్రమోద్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఇదేనా మీరు వారికి చేసే న్యాయం? : రాహుల్