పరిషత్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయభావంతో భాజపా వైపు మొగ్గు చూపినప్పటికి స్థానిక ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీనే ఎన్నుకున్నారని అన్నారు. నియోజకవర్గంలో 60 ఎంపీటీసీ స్థానాలకుగానూ 43 స్థానాలు గెలుచుకోగా.. మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియగానే ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. గిరిజనుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
తెరాసను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు - mptc
పరిషత్ ఎన్నికల్లో తెరాసను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధన్యవాదాలు తెలిపారు. గిరిజనుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తెరాసను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు