ప్రతి రోజు వేల మంది ఆకలి తీర్చడం ఓ మహత్తరమైన కార్యక్రమమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న అన్నదానసత్రాన్ని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం సత్రంలో కొబ్బరికాయ కొట్టి హరీశ్ రావు పూజలు చేశారు. అన్నదాన సత్రం నిర్వహణ వివరాలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంత్రులకు తెలియజేశారు. సత్రంలో ప్రతి నిత్యం 2 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి రమాదేవి దగ్గరుండి చూసుకోవడం వారి సేవాభావానికి నిదర్శమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు నెల రోజుల్లో డయాలసిస్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్నదానం చేయడం నన్ను బాగా కదిలించింది. కానీ ఎమ్మెల్యే సతీమణి దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి జోహార్లు. ఇక్కడ నేను కూడా భోజనం చేశా. చాలా అద్భుతంగా ఉంది. మీరు రాష్ట్ర శాసనసభ్యులకు ఆదర్శంగా నిలిచారు. డయాలసిస్ సెంటర్ కావాలని అడిగారు. నెలరోజుల్లో మంజూరు చేస్తాం.
- హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి