తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో రైలు ప్రయాణికులకు వైద్య పరీక్షలు - telangana express reached to kaghaznagar station

లాక్​డౌన్​ సడలింపులతో తెలంగాణ ఎక్స్​ప్రెస్​లో కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ రైల్వే స్టేషన్​కు చేరుకున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగజ్​నగర్ ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్​ బౌమిక్​, తహసీల్దార్, రైల్వే అధికారులు స్టేషన్​లో రక్షణ చర్యలను పర్యవేక్షించారు. ప్రయాణికులకు సూచనలు చేశారు.

kaghznagar
కాగజ్​నగర్​లో రైలు ప్రయాణికులకు వైద్య పరీక్షలు

By

Published : Jun 1, 2020, 6:14 PM IST

లాక్​డౌన్​ సడలింపుల ఫలితంగా ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ రైల్వే స్టేషన్​ ప్రయాణికులతో కళకళలాడింది. ఉదయం 11.10 నిమిషాలకు తెలంగాణ ఎక్స్​ప్రెస్​ కాగజ్​నగర్​ స్టేషన్​కు చేరుకొంది. కాగజ్​నగర్ ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్​ బౌమిక్​, తహసీల్దార్ ప్రమోద్ కుమార్ ఇతర అధికారులు రైల్వే స్టేషన్ సందర్శించి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. ప్రయాణికుల వివరాలు సేకరించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details