తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లన్న బోనాలు... చూదము రారండి - mallanna bonalu celebrations

సంప్రదాయాలకు భక్తిని మేళవించి జరుపుకునే వేడుకలే పండుగలు. ఇంటిల్లిపాది ఏకమై... ఊరంతా ఓ చోట  చేరి.. ఒకే కుటుంబంగా వంటలు చేసుకుని... పంటలో తొలి మొత్తాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించుకునే వేడుక.. ఆ ఊరంతటికీ పెద్ద పండుగ. ఆ వేడుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలానికి వెళ్లాల్సిందే..

mallanna bonalu celebrations in asifabad district
మల్లన్న బోనాలు... చూదము రారండి

By

Published : Dec 17, 2019, 7:39 AM IST

Updated : Dec 17, 2019, 9:06 AM IST

మంచి జరిగినా... చెడుజరిగినా అంతా దైవసంకల్పమే అనుకునే సంప్రదాయాలు మనవి. పండిన పంటలో తొలి భాగాన్ని దేవుడికి చెల్లించడం చాలా మందికి ఆనవాయితీ.. అలాంటి ఆనవాయితీనే ఓ ఊరంతా పండుగగా చేసుకుంటున్నారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల- నారాయణపూర్ గ్రామాల మధ్యలో వెలసిన మల్లన్న ఆలయంలో బోనాల పండగ వైభవంగా జరుగుతోంది. పంట చేతికొచ్చిన తర్వాత మల్లన్నకు బెల్లం, బియ్యంతో కలిపి చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అనాదిగా ఆచరిస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

షష్టి బోనాల పండుగ పేరుతో పిలుచుకునే ఈ వేడుకలో.. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి దేవున్ని కొలుస్తారు. వారంపాటు నిష్టగా ఉండి.. ఎనిమిదో రోజున ఇంటిల్లపాది ఉపవాసం ఉండి... కొత్త కుండలో పంట బియ్యం, పాలు, బెల్లంతో పాయసం వండి దేవుడికి బోనాలు సమర్పిస్తారు.

కూరగాయలతో వంటలు చేసుకుని దేవుడి సన్నిధిలో సహపంక్తి భోజనాలు చేస్తారు. మల్లన్నను మనసారా మొక్కితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు జరిగే ఈ వేడుకను చూడాలంటే ఆసిఫాబాద్​కు వెళ్లాల్సిందే.

మల్లన్న బోనాలు... చూదము రారండి

ఇదీ చూడండి: రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

Last Updated : Dec 17, 2019, 9:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details