తిర్యాని మండలంలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి ఒకరు కిడ్నాప్‌కు గురైనట్టు కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జగన్నాథరావు కనిపించకుండా పోయారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిర్యానిలో జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్..? - zptc
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి అదృశ్యం కలకలం సృష్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండో విడతలో జరగనున్నప్రాదేశిక ఎన్నికల్లో తిర్యాని మండల జడ్పీటీసీ సభ్యురాలిగా తెరాస తరఫున మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా సిడాం జగన్నాథరావుతోపాటు 12 మంది నామినేషన్ వేశారు. గురువారం మధ్యాహ్నం వరకూ 9 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో కోవా లక్ష్మి కూడా ఉన్నారు. అదే పార్టీ నుంచి చందు బరిలో నిలిచారు. ప్రస్తుతం ముగ్గురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు తన బర్తను కిడ్నాప్ చేశారని జగన్నాథరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిని ఎందుకు కిడ్నాప్ చేస్తామని కాంగ్రెస్ వారి ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చూడండి: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన ఘనుడు