కుమురం భీం జిల్లా నాగేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. మోర్లే సురేష్, మోర్లే చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. వీరి పిల్లలు తిరుపతి, శ్రీధర్ నాల్గో తరగతి చదువుతున్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇచ్చారు. తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయారు.పిల్లలు ఎంతకూ కనపించలేదు. అనుమానంతో తల్లిదండ్రులు బావి వద్దకు వెళ్లారు. విగత జీవులైన చిన్నారులను చూసి తట్టుకోలేకపోయారు. అన్నదమ్ముల పిల్లలు మృత్యువాతతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.