కుమురం భీం జిల్లా కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కాసం శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నేళ్ల క్రితం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా ఇటీవల ఆమోదించింది. ఆర్య వైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కాసం శ్రీనివాస్ కొనసాగుతున్నారు.
కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కాసం శ్రీనివాస్ - telangana news
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కాసం శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఆర్య వైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కాసం శ్రీనివాస్
మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా డోకే రాజన్న, సభ్యులుగా పిర్సింగుల పోచయ్య, నైతం సత్తయ్య, మహమ్మద్ నజీర్, బి. రాణి రాయ్, మౌల్కర్ లక్ష్మణ్, సదాశివ్, ఓం బజాజ్, తోట తిరుపతి, ఎన్నికయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేకు కాసం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.