కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని వెంపల్లి రైల్వే గేట్ సమీపంలో పెద్దపులి.. రెండు దూడలపై దాడి చేసింది. అవి తుంగమడుగు గ్రామ రైతులకు చెందినవిగా గుర్తించారు. సోమవారం నుంచి ఈ దూడలు కనిపించకుండా పోగా బుధవారం నాడు రెండు పెద్దపులికి బలైనట్లు గ్రామస్థులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. లభించిన పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరించి ఉండవచ్చని నిర్ధరించారు. సమీప అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
పెద్దపులి దాడి.. అడవులోకి వెళ్లొద్దని అటవీశాఖ ఆదేశాలు - దూడలు
కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. రెండు దూడలపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని ఆజ్ఞలు జారీ చేశారు.
కాగజ్‌నగర్‌లో పెద్దపులి బారిన రెండు దూడలు