తనపై మున్సిపల్ ఛైర్మన్ దాడి చేశారని ఏఈ ఆరోపణ - కాగజ్నగర్ పురపాలక సంఘం వార్తలు
18:02 November 18
తనపై మున్సిపల్ ఛైర్మన్ దాడి చేశారని ఏఈ ఆరోపణ
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పురపాలక సంఘం ఛైర్మన్ సద్దాం హుస్సేన్ తనపై దాడి చేశారని ఏఈ సతీశ్ ఆరోపించారు. కార్యాలయంలో విధుల్లో ఉన్న తనపై అకారణంగా భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. డీఈ గోపాల్ ఇతర సిబ్బంది చూస్తుండగానే బూతులు తిడుతూ చేయిచేసుకున్నారని, కుర్చీతో గాయపర్చారన్నారు. గతంలోనూ ఇదేవిధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కమిషనర్ శ్రీనివాస్, పై అధికారులకు తెలిపినట్లు సతీశ్ చెప్పారు. ఈ విషయమై ఛైర్మన్ సద్దాం హుస్సేన్ సంప్రదించగా.. తాను ఎవరిపై దాడి చేయలేదని.. ఆ ఆరోపణలన్ని అవాస్తవమని కొట్టిపారేశారు. ఏఈ సతీశ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిల్ మొత్తం మీడియా సమావేశం పెట్టి చెబుదాం అనుకునేలోపు ఇలాంటి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని సద్దాం హుస్సేన్ అన్నారు.
ఇదీ చదవండి :'వంద' చోరీ... దొంగకు ప్రజల దేహశుద్ధి