తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా అధికారిణిపై దాడి ఘటనలో పోలీసులపై వేటు - dgp

కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి ఘటన విషయంలో పోలీస్​ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్​​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ మహేందర్​ రెడ్డి.

డీఎస్పీ, సీఐపై వేటు

By

Published : Jun 30, 2019, 9:08 PM IST

Updated : Jun 30, 2019, 9:54 PM IST

మహిళా అధికారిణిపై దాడి ఘటనలో పోలీసులపై వేటు

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ డీఎస్పీ, రూరల్​ సీఐపై సస్పెన్షన్​​ వేటు పడింది. అటవీశాఖ అధికారులపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంటకేశ్​ను సస్పెండ్​ చేస్తూ డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగజ్​నగర్ మండలం కొత్త సారసాల శివారులో 20 హెక్టార్ల భూమి విషయమై కొంతకాలంగా అటవీశాఖకు... స్థానిక రైతుల మధ్య వివాదం సాగుతోంది. ఈ భూముల్లో.. మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. ఎఫ్​ఆర్​ఓ అనిత నేతృత్వంలో సిబ్బంది భూమి చదును చేసేందుకు ట్రాక్టర్లతో అక్కడి వెళ్లారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడైన జడ్పీటీసీ కోనేరు కృష్ణారావుతోపాటు అతని అనుచరులు అటవీ అధికారులపై దాడికి దిగారు. అక్కడ పోలీసులున్నా ఏం చేయాలేకపోయారనే ఆరోపణలు రావడం వల్ల కాగజ్​నగర్​ డీఎస్పీ, రూరల్​ సీఐపై సస్పెన్షన్​ వేటు పడింది.

Last Updated : Jun 30, 2019, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details