కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో నివసించే ప్రజలు ఇబ్బందిపడ్డారు. గాలివానకు మంతెన నరేష్ ఇంటి పైకప్పు ఎగిరిపోవడం వల్ల ఇంట్లోని సరుకులు పూర్తిగా తడిచిపోయాయి.
గాలివాన బీభత్సం... ఎగిరిపోయిన ఇంటి పైకప్పు
కుమురంభీం ఆసిఫాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోయిందని ఆ ఇంటి యజమాని మంతెన నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాలివాన బీభత్సం... ఎగిరిపోయిన ఇంటి పైకప్పు
దర్జీ పని చేస్తూ కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇలా కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకుని ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి:వర్సిటీ భూములను రీ సర్వే చేయాలి: వీహెచ్