కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వాగులపైన వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చింతల మానేపల్లి మండలంలోని దిందా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో దిందా, కేతిని గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనులు ఉన్న ప్రజలు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ వాగు దాటేందుకు సాహసం చేస్తున్నారు.
కురుస్తున్న వర్షాలు... పొంగుతున్న వాగులు - rains
కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వానలకు వాగులూ వంకలు పొంగి పొర్లుతున్నాయి.
కురుస్తున్న వర్షాలు-పొంగుతున్న వాగులు