కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని చేనేత కార్మికులకు పలువురు నిత్యావసర సరుకులు అందించారు. పట్టణ కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్మికులకను కాంగ్రెస్ నాయకులు పాల్వాయి హరీష్ బాబు, హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రికి చెందిన పిల్లల నిపుణులు రమేష్ కోనంకిల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
చేనేత కార్మికులకు సరుకుల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు పలువురు నిత్యావసర వస్తువులు అందజేశారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని చేనేత కార్మికులు లాక్డౌన్ వల్ల తిండికి, రోజూవారి జీవితానికి ఇబ్బందులు పడకుండా తమవంతు సాయం అందిస్తున్నట్టు దాతలు తెలిపారు.
చేనేత కార్మికులకు సరుకుల పంపిణీ
చేనేత పరిశ్రమ మీదనే ఆధారపడి బతికే నేతన్నలకు తమవంతు సాయంగా నిత్యావసరాలు అందించినట్లు దాతలు పాల్వాయి హరీష్ బాబు, డాక్టర్ రమేష్ కోనంకి తెలిపారు.
ఇదీ చూడండి:ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు