కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాములోరి కల్యాణానికి వడ్లను గోటితో తీస్తూ తలంబ్రాలుగా మార్చారు. పత్తి నాగలక్ష్మి ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి తెచ్చిన వడ్లను స్థానిక మహిళలు పొట్టు తీసి తలంబ్రాలను సిద్ధం చేశారు.
ఆసిఫాబాద్లో 'గోటితో కోటి తలంబ్రాలు' కార్యక్రమం - భద్రాచలం వార్తలు
'గోటితో కోటి తలంబ్రాలు' కార్యక్రమంలో భాగంగా మహిళలు వడ్లను గోటితో తీస్తూ తలంబ్రాలుగా మార్చారు. ఏప్రిల్ 5 లోపు కోటి తలంబ్రాలను తయారు చేసి రాములోరి కల్యాణానికి పంపిస్తామని వెల్లడించారు.
ఆసిఫాబాద్లో 'గోటితో కోటి తలంబ్రాలు' కార్యక్రమం
'గోటితో కోటీ తలంబ్రాలు' కార్యక్రమం పురస్కరించుకుని పూజలు చేశారు. ఏప్రిల్ 5వ తేదీలోపు గోటితో కోటి తలంబ్రాలను తయారుచేసి... సీతారాముల కల్యాణం కోసం భద్రాచలం పంపిస్తామని మహిళలు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకపై కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.