తెలంగాణ

telangana

ETV Bharat / state

' 53 ఏళ్లకు మళ్లీ కలిశారు.. అదే ఉత్సాహం చూపించారు' - పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Get To Gether: చిన్ననాటి జ్ఞాపకాలు చెరిగిపోనివి. బాల్యంలో మనం గడిపిన క్షణాలు అత్యంత మధురమైనవి. జీవితంలో ఒక్కసారైనా కాలం వెనక్కి వెళ్లిపోతే బాగుండు అని అనుకోనివారు ఎవరూ ఉండరు. అలాంటి మధుర క్షణాలను ఆస్వాదించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అలనాటి మధురానుభూతులను ఓసారి తిరిగి చూసుకోవడానికే 'గెట్​ టు గెదర్' అనే కార్యక్రమం కూడా​ ఉందండి. ఇవాళ కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.

Get To GetherGet To Gether
Get To Gether

By

Published : Jul 24, 2022, 10:58 PM IST

Get To Gether: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఎంతో మధురానుభూతిని కలిగిచిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్​లో 1969-70 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులంతా 'గెట్​ టు గెదర్​' సందర్భంగా కలిశారు. 53 ఏళ్ల తర్వాత 60 మంది విద్యార్థుల ఒకే చోట కలవడంతో వారి ఆప్యాయతకు అంతులేకుండా పోయింది.

' 53 ఏళ్లకు మళ్లీ కలిశారు.. అదే ఉత్సాహం చూపించారు'

ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు పాండురంగారావు, విఠల్ రావు, కొమురయ్య, రామాంజనేయులు, మురళీధర్ రావులను ఘనంగా సన్మానించి.. కానుకలు అందించారు. జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. పాఠశాలలో చదువుకున్న కాలం ఎంతో గొప్పదని గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత స్నేహితులంతా కలిసి ఒకచోట కలవడం శేష జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలి పోతుందన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడానికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అదే బ్యాచ్​కు చెందిన కొంతమంది ఇప్పటికే మరణించడంతో వారికి నివాళులర్పించారు. ఏది ఏమైనా మరోసారి వారంతా కుర్రాళ్లుగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మధుకర్, టీఆర్ అశోక్, గాదె అనిల్, తాటిపల్లి రాజేశ్వర్, మసాడే సునీల్, సిర్ప అశోక్, వల్లభ అశోక్, తాటి పెళ్లి పెంటక్క, సంఘర్ష, సురేఖ, ఇతరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details