కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలికలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ శ్రీనివాస్ మూడు స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. పట్టణంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించేందుకు ఈ ఆటోలు కొనుగోలు చేసినట్లు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 5 ఆటోలు కొనుగోలు చేయగా... 3 మాత్రమే డెలివరీ అయ్యాయని మరో రెండు రావాల్సి ఉందని వెల్లడించారు.
'చెత్త సేకరణ వాహనాలను ప్రజలు ఉపయోగించుకోవాలి' - garbage collection vehicle in kagajnagar municipality
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలక సంఘంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించారు. ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పురపాలక అధికారులు పాల్గొన్నారు.