తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు ఆత్మహత్యాయత్నం... - former

20 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి తనది కాదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. పొలం స్వాధీనం చేసుకున్నారు. దిక్కుతోనచి ఆ రైతు ప్రాణం తీసుకునేందుకు సిద్ధపడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

రైతు మల్లేశ్​

By

Published : Jun 8, 2019, 3:24 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​ నగర్​ మండలం కొత్త సార్సాలకు చెందిన లక్క మల్లేశ్​ 3 ఎకరాల భూమిలో గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల అటవీ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుందుకు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్​తో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించగా రైతు మల్లేశ్​ అడ్డుకున్నాడు. ఈ పొలం అటవీ శాఖకు చెందిందని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మనస్థాపం చెందిన రైతు మల్లేశ్​ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని కుటుంబ సభ్యులు కాగజ్ నగర్​లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

రైతు ఆత్మహత్యాయత్నం...

ABOUT THE AUTHOR

...view details