తెలంగాణ

telangana

ETV Bharat / state

పులి దాడిలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం - తెలంగాణ వార్తలు

కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామంలో పులి దాడిలో మృతి చెందిన విగ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అటవీ శాఖ అధికారులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు అందించారు.

పులి దాడిలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం
పులి దాడిలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం

By

Published : Nov 13, 2020, 3:40 PM IST

పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అటవీ శాఖ అధికారులు పరామర్శించారు. కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడలో బుధవారం పశువులను మేపడానికి వెళ్లిన సిడం విగ్నేష్​పై పెద్దపులి దాడి చేసింది. ఘటనలో యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.

కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మృతుడి తండ్రికి రూ.5లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు అతని తండ్రికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో చాలా గ్రామాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ డివిజన్ ఎఫ్​డీవో విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'జనవరి వరకు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి'

ABOUT THE AUTHOR

...view details