కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న రైతులు, వారి జీవిత భాగస్వాములు ఈ పథకంలో చేరవచ్చని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస రావు, పలువురు స్థానిక రైతులు పాల్గొన్నారు.
పీఎం కిసాన్ మాన్ధన్పై రైతులకు అవగాహన సదస్సు - పీఎం కిసాన్ మాన్‌ధన్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
పీఎం కిసాన్ మాన్‌ధన్ పై రైతులకు అవగాహన సదస్సు