'జెన్నూరు జడ్పీటీసీ ఎన్నిక రద్దు చేయండి' - jainur
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడో విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జైనూర్లో జడ్పీటీసీ ఏకగ్రీవమైన స్థానంను రద్దు చేయాలని జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన మెస్రం చంద్రకళ డిమాండ్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో జడ్పీటీసీ స్థానానికి భాజపా తరఫున మెస్రం చంద్రకళ నామినేషన్ వేసింది. ఈనెల ఐదున బి ఫాం కోసం వెళ్లగా.. పార్టీ నిరాకరించింది. స్వతంత్రులుగా అయినా బరిగా ఉండాలని మెస్రం చంద్రకళ ఆమె భర్త వెనుదిరిగారు. తిరుగు ప్రయాణంలో ఉట్నూరు దగ్గర తెరాసకు చెందిన షేక్ ఖాదీర్ మరో ఇద్దరితో కలిసి వచ్చి తమను కిడ్నాప్ చేసినట్లు చంద్రకళ దంపతులు ఆరోపించారు. తదుపరి రోజు తనతో బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని వాపోయారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి ఈనెల 16న జరిగే ఎన్నికను రద్దు చేయాలని చంద్రకళ దంపతులు కోరారు.