కుమురం భీం ఆసిఫాబాద్ ఏజెన్సీల్లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నెలకొల్పిన సర్కారు ఆస్పత్రులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్ టీ మండలాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎన్ఎంలే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవాలి.
వైద్యులే లేరు
14 మంది వైద్యులుండాల్సిన ఈ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అతను కూడా నిత్యం కాగజ్‌నగర్ నుంచి వచ్చిపోతుంటాడు. వైద్యాధికారుల నియామకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరుతో దవాఖానాలు నిరుపయోగంగా మారాయి. కాసులుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం, లేదంటే దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు స్థానికులు.
నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి ఇదే అవడం వల్ల నిత్యం వందలాది మంది వస్తుంటారు. వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు, ఏఎన్ఎంలు వైద్య పరీక్షలు చేసి ఇతర పట్టణాల్లో ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రజలు కాగజ్‌నగర్‌కు, మంచిర్యాలకు వెళ్తున్నారు.
అవసరాలను సొమ్ముచేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు