ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన - ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన
12:56 July 17
ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మిక పర్యటనకు వచ్చారు. గత వారం రోజులుగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినందున పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ఆసిఫాబాద్ వచ్చారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వారం క్రితం ఏజెన్సీలో కూంబింగ్ పార్టీకి మావోయిస్టులు కనిపించి.. తప్పించుకున్నారు. వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ కూడా ఉన్నాడన్న సమాచారంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఈ నెల 15న తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని సమీక్షించడంతో పాటు... మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్‌పై జిల్లా అధికారులతో చర్చించారు.