కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల గాలింపు చర్యల్లో పాల్గొన్న ఇద్దరు సీఐలు, పది మంది ఎస్సైలకు డీజీపీ మహేందర్‌రెడ్డి నగదు పురస్కారాలు అందజేశారు. జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ... తిర్యాని అడవుల్లో పోలీసుల నుంచి మావోయిస్టులు తప్పించుకోవడం, ఎదురుకాల్పులు తదితర విషయాలపై ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా చర్చించారు. పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
మావోయిస్టుల గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులకు రివార్డులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల గాలింపు చర్యల్లో పాల్గొన్న పలువురు పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి రివార్డులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సమీక్ష నిర్వహించారు. పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
మావోయిస్టుల గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులకు రివార్డులు
అడవిలో మావోయిస్టులకు సంబంధించిన బ్యాగు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకోవటం, భోజనం పెట్టిన వ్యక్తులను పట్టుకోవడం, ఎదురుకాల్పులు, విస్తృత గాలింపు చర్యల్లో పాల్గొన్న పలువురు పోలీసు అధికారులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందించారు. మావోయిస్టుల రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేళ్ళు అలియాస్ భాస్కర్‌తో పాటు మరో నలుగురు తిర్యాని మండల మంగి అడవుల్లో సంచరిస్తున్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.