తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ బయల్దేరిన డీజీపీ మహేందర్​ రెడ్డి!

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో జిల్లా హెలికాప్టర్​ ద్వారా జిల్లాకు చేరుకున్న డీజీపీ మహేందర్​ రెడ్డి తిరిగి హైదరబాద్​ వెళ్లిపోయారు. సెప్టెంబర్​ 2న ఆసిఫాబాద్​కు వచ్చిన డీజీపీ నాలుగు రోజుల తర్వాత రాష్ట్ర రాజధానికి తిరిగి వెళ్లారు. రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్​ ఎస్పీ విష్ణు వారియర్​తో కలిసి ఆయన అటవీ ప్రాంతంలో ఏరియల్​ సర్వే నిర్వహించారు.

DGP Mahender Reddy Completed Asifabad Tour And Returned To Hyderabad
హైదరాబాద్​ బయల్దేరిన డీజీపీ మహేందర్​ రెడ్డి!

By

Published : Sep 6, 2020, 5:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో జిల్లా కేంద్రానికి చేరుకున్న డీజీపీ మహేందర్​ రెడ్డి తిరిగి హైదరాబాద్​ పయనమయ్యారు. ఆదిలాబాద్​ ఎస్పీ విష్ణు వారియర్​, రామగుండం సీపీ సత్యనారాయణలతో కలిసి ప్రాణహిత నది పరివాహక ప్రాంతంతో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అటవీ ప్రాంతంలో ఏరియల్​ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్​ ద్వారా ఏరియల్​ సర్వే చేసిన అనంతరం ఆయన ఆసిఫాబాద్​ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. సెప్టెంబర్​ 2 నుంచి 6 వరకు ఆయన ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే బస చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సెప్టెంబర్​ 4న జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన తిర్యాని పోలీస్​ స్టేషన్​ను డీజీపీ సందర్శించారు. అక్కడి పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

గత ఐదురోజులుగా డీజీపీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. పర్యటన చివరి రోజు కూడా మీడియాకు సమయం ఇవ్వకుండానే రోడ్డు మార్గాన హైదరాబాద్​ బయలుదేరారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాల వివరాలను పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. కాగా.. కుమురం భీం జిల్లాలో డీజీపీ ఐదు రోజుల పర్యటన ముగిసినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు

ABOUT THE AUTHOR

...view details