తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్మికుల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయం'

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణ భవన నిర్మాణ కార్మికులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో కార్మికులు తెరాసలో చేరారు. కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా... తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.

Construction workers joined in trs in kagaznagar
Construction workers joined in trs in kagaznagarConstruction workers joined in trs in kagaznagar

By

Published : Jan 1, 2021, 4:11 PM IST

తెరాస ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో కార్మికులు తెరాసలో చేరారు. సంఘం నాయకులకు, కార్మికులకు ఎమ్మెల్యే... గులాబీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.

తెరాసలో చేరుతున్న భవన నిర్మాణ కార్మికులు

గత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని మరిచాయని ఎమ్మెల్యే విమర్శించారు. తెరాస ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరుతున్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో కార్మిక సంఘానికి భవనం లేదని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. భవన నిర్మాణానికి అనువైన స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా... తనను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చూడండి: తెలంగాణ భవన్​లో నూతన సంవత్సర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details