కుమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెయ్యి ఎనిమిది మంది జంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 60 మంది వేద పండితుల చేత ఈ సాముహిక సత్యనారాయణ వ్రతం చేశారు.
గంగాపూర్‌లో సాముహిక సత్యనారాయణ వ్రతం - గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్‌లో సాముహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. 60 మంది వేద పండితులతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గంగాపూర్‌లో సాముహిక సత్యనారాయణ వ్రతం
1008 మంది జంటలకు ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో పూజ సామగ్రి పంపిణీ చేశారు. ఈ సత్యనారాయణ వ్రతం మహోత్సవానికి రాష్ట్రంలోని భక్తులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.