కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపునగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఉత్తమ్ సింగ్ ఎలక్ట్రికల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా... బీరువా పగలకొట్టి ఉంది. అందులోని 15లక్షల రూపాయలు అపహరించినట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టారు. తరచుగా తమ ఇంటికి వచ్చే ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన కార్మికులపై అనుమానం వ్యక్తం చేశాడు. వారు రాత్రి రాజస్థాన్‌కు వెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
ఆసిఫాబాద్‌లో భారీ చోరీ... 15 లక్షలు మాయం - kaveri electricals
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు బీరువా పగలగొట్టి 15లక్షలు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆసిఫాబాద్‌లో భారీ చోరీ... 15 లక్షలు మాయం