బైక్ నేర్చుకోవాలనే సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. కుమురంభీం జిల్లా కౌటాల మండలానికి చెందిన పదమూడేళ్ల బాలుడు మనోజ్..ద్విచక్ర వాహనం నేర్చుకునే క్రమంలో గోడకు గుద్దుకుని అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం తన స్నేహితుడు టివీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనం తీసుకురావటంతో తాను నడుపుతానంటూ పక్కనే ఉన్న మినీ స్టేడియంలోకి వెళ్లారు. ముందు బాగానే నడిపిన మనోజ్ ఒక్కసారిగా వాహనం వేగం పెరగటంతో ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావటం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడే వస్తానని ఇంటి నుంచి వెళ్లి కుమారుడు మరణించటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బైక్ డ్రైవింగ్ నేర్చుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు
ద్విచక్రవాహనం నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలంలో చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు బాలుడు మృతి
ఇవీ చూడండి: 'క్షౌరం కోసం వెళ్తే ప్రాణాలు పోయాయి'