కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు కమలం కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని గుజ్జల అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగజ్‌నగర్‌లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం - bjp-membership enrollment program
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్దన్ హాజరయ్యారు.
భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం