పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో భాజపా నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతుల పట్ల అటవీశాఖ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురిచేస్తున్నారని వాపోయారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో తెరాస ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోడు భూముల సమస్య పరిష్కరించాలంటూ దీక్ష - asifabad district latest news
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లిలో భాజపా నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
భాజపా ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష
పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి తెరాస ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందని విమర్శించారు. దీక్షా స్థలిని ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర సందర్శించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, దీక్ష విరమించాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్ష విరమించేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కరోనా మృతుడికి అంబులెన్స్ సిబ్బంది అంత్యక్రియలు