దొంగ అరెస్టు...5 బైక్‌లు స్వాధీనం అసిఫాబాద్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న సాగర్ సర్కార్ అనే వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీ సమయంలో సరైన పత్రాలు చూపించకపోవటంతో అనుమానం వచ్చి విచారించారు. పోలీసుల నిలదీతకు దొంగతనం చేశానట్లు ఒప్పుకున్నాడు. కాగజ్‌నగర్ మండలం ఈజ్గ్రామ్కు చెందిన సాగర్ అంతకుముందు చోరీ చేసిన నాలుగు బైక్‌ల వివరాలను కూడా తెలియజేశాడు. వాటి విలువ లక్షా నలభై ఐదువేలకు పైగా ఉండొచ్చని స్థానిక సీఐ మల్లయ్య తెలిపారు.సాగర్‌పై బెల్లంపల్లి, ఎన్టీపీసీ రామగుడం, మంచిర్యాల పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.