తెలంగాణ

telangana

ETV Bharat / state

అనారోగ్యంతో​ విద్యార్థిని మృతి.. పాఠశాల ముందు బైఠాయించిన తల్లిదండ్రులు

Girl died due to illness: రోజు చక్కగా ఆడుతుపాడుతూ తిరుగుతూ ఉండే ఆ విద్యా కుసుమం అదే పాఠశాల ఆవరణలో కుప్పకూలింది. ఎన్నో కలలు కని ఉన్నత శిఖరంలో ప్రయాణించాలని అనుకునే ఆ ప్రయాణం తాను చదువుకునే పాఠశాల ఆవరణలోనే అర్ధంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. అనారోగ్యంతో కుమురం భీం జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య మరణం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది.

Girl died due to illness
Girl died due to illness

By

Published : Sep 7, 2022, 2:56 PM IST

Updated : Sep 7, 2022, 4:30 PM IST

Girl died due to illness: కుమురం భీం జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. అంకుసాపూర్‌కు చెందిన ఐశ్వర్య కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఉదయం ఆమె అస్వస్థతకు గురవటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించామని పాఠశాల సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతూ ఐశ్వర్య మృతి చెందిందని పేర్కొన్నారు.

తమకు యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో విద్యాలయం ముందు ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. వారికి విద్యార్థి సంఘాలు, పలు పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకనొక దశలో ఆందోళనకారులు.. ఎస్‌ఓ కార్యలయంలోకి దూసుకెళ్లి సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

విద్యాలయానికి వచ్చిన అదనపు పాలనాధికారి రాజేషం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 50వేల నగదు అందజేశారు. బాపరిహారం విషయం ఉన్నతాధికారులకు నివేదించి సరైన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాలిక మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details