కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వ్యాపారుల వద్ద సరుకు నిల్వ వివరాలను అదనపు పాలనాధికారి రాంబాబు సేకరించారు. లాక్డౌన్ కారణంగా పెద్దమొత్తంలో సరకులను ఎవ్వరూ నిల్వ ఉంచుకోవద్దని... వినియోగదారులు ఎక్కువ మొత్తంలో సరకులు కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు.
'అవసరమైన మేరకే సరకు నిల్వ ఉంచండి'
లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరకులకు లోటు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్నగర్ పట్టణంలో వ్యాపారుల వద్ద ఉన్న సరకు నిల్వ వివరాలను అదనపు పాలనాధికారి సేకరించారు. అవసరాలకు మించి నిల్వ ఉంచుకోవద్దని సూచించారు.
'అవసరమైన మేరకే సరకు నిల్వ ఉంచండి'
సరకు నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నించినా.. ధరలు పెంచి విక్రయించినా చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి సరకు రవాణాకు అనుమతులు దొరకడం లేదని వ్యాపారులు అదనపు పాలనా అధికారి దృష్టికి తీసుకొచ్చారు. సరకు రవాణా విషయంలో ఆయా శాఖల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'