తెలంగాణ

telangana

ETV Bharat / state

హస్తినకు ఆదివాసీలు.. రేపు దిల్లీలో మహా సభ - కుమురం భీం జిల్లా ఆదివాసీలు

"ఊరు దాటి బయటకి రాని ఆదివాసీలు నేడు దిల్లీ వరకు వెళ్లి మా గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమయ్యామంటే.. మా డిమాండ్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి" -ఆదివాసీలు

రేపు దిల్లీలో మహా సభ
హస్తినకు ఆదివాసీలు..

By

Published : Dec 8, 2019, 6:40 AM IST

Updated : Dec 8, 2019, 7:50 AM IST

హస్తినకు ఆదివాసీలు.. రేపు దిల్లీలో మహా సభ
దేశ రాజధానిలో ఆదివాసీ అస్తిత్వ గర్జన మహాసభకు కుమురం భీం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు బయలుదేరారు. ఈనెల 9న దిల్లీ రామ్ లీల మైదానంలో మహా సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాగజ్ నగర్ నుంచి ప్రత్యేక రైల్లో జిల్లాలోని పలు మండలాల ఆదివాసీలు బయలుదేరారు. శనివారం సాయంత్రానికల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకున్న ఆదివాసీలు రాత్రి 11 గంటలకు రైలులో దిల్లీకి పయనమయ్యారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడమే తమ ప్రధాన డిమాండ్ అని ఆదివాసీ నాయకులు తెలిపారు. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలకు పోడు భూములపై హక్కులు కల్పించాలని కోరారు. "ఊరు దాటి బయటకి రాని ఆదివాసీలు నేడు దిల్లీ వరకు వెళ్లి మా గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమయ్యామంటే.. మా డిమాండ్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి" అని పేర్కొన్నారు.

Last Updated : Dec 8, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details