తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత కేసులో ప్రత్యేక కోర్టు తుది తీర్పు... దోషులు ముగ్గురికి మరణ శిక్ష - asifabad rape case

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఆదిలాబాద్​ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు షేక్​బాబు, షేక్​ షాబుద్దీన్​, షేక్​ మఖ్దూంలను దోషులుగా నిర్దరించింది. గత నవంబర్​ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్​ మండలం ఎల్లాపటార్​ సమీపంలో బాధితురాలు సమతపై నిందితులు సామూహిక హత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

samatha case
సమత కేసులో ప్రత్యేక కోర్టు తుది తీర్పు... దోషులు ముగ్గురికి మరణ శిక్ష

By

Published : Jan 30, 2020, 8:27 PM IST

Updated : Jan 30, 2020, 9:36 PM IST

సమత కేసులో ప్రత్యేక కోర్టు తుది తీర్పు... దోషులు ముగ్గురికి మరణ శిక్ష

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో తుది తీర్పు వెలువడింది. కిరాతకానికి పాల్పడిన షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.

సమత ఘటన

కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ వద్ద నవంబర్‌ 24న సమతపై నిందితులు అత్యాచారం చేసి కిరాతంగా హత్య చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

ఘటన జరిగిననాటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు దిశ హత్యోదంతం... నిందితులు పోలీసుల ఎన్​కౌంటర్​లో మరణించడం తర్వాత సమత కేసులో నిందితులను తక్షణమే శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి.

ఘటనపై ప్రత్యేక కోర్టు

ఈ హేయమైన ఘటనపై పోలీస్ శాఖ విజ్ఞప్తిపై ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 14న ఛార్జిషీటు దాఖలు కాగా.. డిసెంబర్‌ 23 నుంచి 31వరకు సాక్షుల విచారణ కొనసాగింది. జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ వాదనలు ప్రత్యేక కోర్టులో కొనసాగాయి.

విచారణ సాగిందిలా..

⦁ నవంబర్​ 24న లింగాపూర్​ మండలం ఎల్లాపటార్​ వద్ద సమతపై హత్యాచారం

⦁ నవంబర్‌ 27న నిందితులు షేక్‌ బాలు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మఖ్దూం అరెస్టు

⦁ డిసెంబర్​ 14న ఛార్జిషీటు దాఖలు

⦁ డిసెంబర్​ 23 నుంచి 31 వరకు పలు దశల్లో సాక్షుల విచారణ

⦁ జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ వాదనలు

⦁ జనవరి 30న దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తుదితీర్పు

నిందితులకు జరిమానా

నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు న్యాయమూర్తి రూ.26 వేలు జరిమానా విధించారు.

కన్నీరు పెట్టుకున్న దోషి

తీర్పు వెలువరించే ముందు చెప్పుకునేది ఏమైనా ఉందా అని దోషులను న్యాయమూర్తి ప్రశ్నించారు. వారిపై మోపిన నేరం రుజువైందని తెలిపారు. దోషి షేక్‌బాబు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టాడు. తనకు వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నాడు. తమను క్షమించాలంటూ మిగితా నిందితులు విన్నవించుకున్నారు. అనంతరం వారికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తీర్పు వెలువరిస్తూ ఈ ముగ్గురు దోషులు చేసిన నేరం చాలా ఘోరమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

తీర్పుపై పోలీసుల హర్షం

నిందితులకు ఉరిశిక్ష విధించడంపై పోలీస్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. పక్కా ఆధారాలతో తమ సిబ్బంది చేసిన కృషిని ఎస్పీ మల్లారెడ్డి అభినందించారు. నిందితులను మరణించే వరకు ఉరితీయాలని పీపీ తెలిపారు.

న్యాయం జరిగిందన్న సమత కుటుంబసభ్యులు

అటు కోర్టు తీర్పుపై సమత కుటుంసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని సమత భర్త వాపోయారు.

దోషుల కుటుంబీకులేమంటున్నారు

సమత ఘటనపై దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దోషుల బంధువులు తమ పిల్లలు ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు. ఘటన జరిగినప్పుడు ఎవరైనా చూశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో తమకు న్యాయం జరగలేదని.. తీర్పుపై పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామంటున్నారు.

ఇదీ చూడండి:నిర్భయ కేసు: తిహార్ అధికారులకు దిల్లీ కోర్టు నోటీసులు

Last Updated : Jan 30, 2020, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details