కాగజ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం - auto
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణం వంతెనపై రోడ్ ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టడం వల్ల ఇద్దరు గాయపడ్డారు.
కారు, ఆటో
ఇస్గాం నుంచి వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటలో ఇద్దరికి గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణం వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో ఆసిఫాబాద్ ఏఎంవీఐ కవితకు ప్రమాదం తప్పింది. ఆటో నుజ్జు నుజ్జు కాగా కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇవీ చూడండి: పై అధికారి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం