తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణతో ముడిపడి ఉందని షర్మిల నమ్ముతోందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న సంకల్పసభలో ఆమె ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో తమకున్న అనుబంధం చెరిగిపోనిదని విజయమ్మ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశం నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నారు.
షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ - షర్మిల సంకల్ప సభ
అభివృద్ధి, సంక్షేమం రెండు కల్లుగా దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సాగిందని వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ అన్నారు. ఆయన చూపిన బాటలోనే షర్మిల పాలన సాగిస్తోందని విజయమ్మ పేర్కొన్నారు.
vijayamma
ఆమె నీతి వంతమైన రాజకీయాలతో రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం, ఇంటింటికీ సంక్షేమం అందిస్తోందని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆమె వేసే ప్రతి అడుగు, ప్రతి పని తెలంగాణ కోసమేనని అన్నారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా... తెలంగాణ ప్రజలంతా షర్మిలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:సాగర్ ఉపఎన్నికలో కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి
Last Updated : Apr 9, 2021, 9:47 PM IST