ఖమ్మం జిల్లాలో ప్రధానమైన వైరా జలాశయం పూర్తి నీటిమట్టంతో నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటి అలుగు ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. జలాశయం నుంచి కిందకు జలువారుతున్న జలాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. దసరా సెలవులు కావడం వల్ల పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. అలుగు వాగు నుంచి భారీగా నీరు పారడం వల్ల పలు గ్రామాల్లో చిన్న కరకట్టలు మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిషన్ భగీరథకు నీటి కొరత లేకుండా నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోంది.
ఛలో వైరా.. జలకళతో ఆహ్లాదంగా జలాశయం - khammam district wyra reservoir
ఖమ్మం జిల్లాలోని వైరా జలాశయం పూర్తి నీటిమట్టంతో జలకళను సంతరించుకొంది. ఒక్కసారైన చూడాలి అనేంతగా జలాశయ పరిసరాలు ఆహ్లాదంగా మారాయి.
ఛలో వైరా.. జలకళతో ఆహ్లాదంగా జలాశయం