ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో వైరా తెరాస ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పర్యటించారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుని ఓటు అడిగేందుకు గీత కార్మికుడి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే..తాటికల్లు సేవించారు.
ఎన్నికల ప్రచారంలో కల్లు తాగిన ఎమ్మెల్యే - కల్లు తాగిన వైరా ఎమ్మెల్యే
శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పర్యటించారు. ఓటు అడిగేందుకు గీత కార్మికుడి ఇంటికి వెళ్లిన ఆయన.. అక్కడ కల్లు తాగారు.
వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్
ఆరుగాయలు పాడు గ్రామంలో యాలాద్రి అనే గీత కార్మికుడి కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు అతని ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే.. వారి కోరిక మేరకు కల్లు తాగారు. అనంతరం ఆ కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ఎమ్మెల్యే కల్లు తాగడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి:గురుకులాల్లో సవాలుగా మారిన భౌతిక దూరం సమస్య