వైభవంగా ఆరంభమైన బతుకమ్మ ఉత్సవాలు - WYRA LO BATHAKAMMA
ఖమ్మం జిల్లా వైరాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
వైభవంగా ఆరంభమైన బతుకమ్మ ఉత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని ఓ ప్రవేటు పాఠశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పది అడుగుల బతుకమ్మను.. తీరొక్క, గులాబీ, బంతి వంటి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు బతుకమ్మ చుట్టూ సంతోషంగా కోలాటాలు ఆడారు.