తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో మహిళ ఆత్మహత్యాయత్నం - sucide attempt

పోలీసులు న్యాయం చేయలేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కుమురంభీం  జిల్లా కాగజ్​నగర్​లో జరిగింది. తన కుమారుడికి రోడ్డు ప్రమాదంజరిగింది... అందులో తమదే తప్పని పోలీసులు రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని బాధితులు ఆరోపించారు.

సమీరా

By

Published : Jul 16, 2019, 11:30 PM IST

Updated : Jul 17, 2019, 7:35 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన సమీరా, షోయబ్​ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత నెల 6న పెద్ద కుమారుడు అష్రఫ్​ సైకిల్​ను ఓ వ్యాపారి వాహనం ఢీకొట్టింది. వాహన యజమాని వైద్య ఖర్చులు భరిస్తానని తెలిపారు. బాలుని చికిత్సకు లక్ష 50వేల రూపాయలు అయ్యాయి. వ్యాపారి 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే తప్పు తమవైపే ఉందంటూ, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేక సమీరా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

కాగజ్​నగర్​లో మహిళ ఆత్మహత్యాయత్నం
Last Updated : Jul 17, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details