తెలంగాణ

telangana

ETV Bharat / state

Wall Fell on Gurukula Students in Khammam : ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ..విద్యార్థులకు శాపం.. స్పందించని అధికారులు - ఖమ్మం వార్తలు

Wall Fell on Gurukula Student in Khammam : చదువు చెప్పాల్సిన టీచర్లే విద్యార్థులతో కూలీ పనులు చేయిస్తున్నారు. బంగారు బాటలో నడిపించాల్సిన వారే విద్యార్థుల జీవితాన్ని చిన్నాభిన్నాం చేస్తున్నారు. ఖమ్మం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ఇసుక, ఇటుకలు మోయిస్తున్నారు. ఒక విద్యార్థి కుడి కాలిపై ప్రమాదవశాత్తు గోడ కూలింది. కాలికి రెండు చోట్ల గాయం కావడంతో బాలుడు నడవలేని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి తల్లి తమని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతుంది.

The Wall Fell on Gurukula Student
The Wall Fell on Gurukula Student in Khammam

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 11:45 AM IST

The Wall Fell on Gurukula Students in Khammam ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ..విద్యార్థులకు శాపం.. స్పందించని అధికారులు

Wall Fell on Gurukula Student in Khammam : నిరుపేద కుటుంబం.. కుమారుడు బాగా చదువుకుని చేతికి అందివస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. నడవలేని స్థితిలో పిల్లాడు ఇంటికి చేరడంతో.. కన్నవారు కన్నీటిపర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా బోనకల్లులోని గురుకుల పాఠశాల(Gurukula School)లో... ఉపాధ్యాయులు పాత గోడ కూల్చే పనులను విద్యార్థులతో చేయించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోడ కూలి(Wall Collapse) పదవ తరగతి విద్యార్థిపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.

Wall Collapse in Khammam Gurukul School : ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం నూకలంపాడు గ్రామానికి చెందిన మట్టా అరవింద్‌ ... బోనకల్లులోని బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మరుగుదొడ్ల వద్ద పాత గోడను కూల్చేపనిని అక్కడి ఉపాధ్యాయులు... విద్యార్థులకు అప్పగించారు. ఇటుకలు మోస్తుండగా... ఒక్కసారిగా గోడ కూలి అరవింద్‌పై పడింది. దాంతో కుడి కాలు రెండు చోట్ల విరిగింది. తీవ్రగాయాలతో ఉన్న విద్యార్థిని గురుకుల సిబ్బంది ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

Asifabad Gurukula School Students Protest : 'మాకు ఈ ప్రిన్సిపల్​ వద్దు అంటే వద్దు'

"స్కూల్లో ఇటుకలు ఏరమన్నారు. మేము వాటిని ఏరడానికి పోయాము. గోడ కూలగొడుతున్నారు ఆ ఇటుకలనే మేము సేకరిస్తున్నాం. వాళ్లు ఒక్కసారిగా గోడను కూల్చారు. ఆ గోడంతా వచ్చి నాపై పడింది. అప్పటికప్పుడే అంబులెన్స్​ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. మేము స్నానాలు చేసే చోట అందరికి పాములు తేళ్లు కుడుతున్నాయని బెస్​మెంట్​ వేయించాలి అనుకున్నారు. అందుకు కావాల్సిన ఇటుకలు, ఇసుక తీసుకురమ్మన్నారు ఇలా జరిగింది ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవడం లేదు." - అరవింద్, విద్యార్థి

గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎలుకలు.. విద్యార్థులకు తిప్పలు!

కూలి చేసుకుంటే గాని పూట గడవని పరిస్థితి: ప్రస్తుతం అరవింద్‌ నడవలేని స్థితిలో ఉన్నాడు. కేవలం జ్యూస్‌లు, పాలు మాత్రమే తాగుతున్నాడు. తల్లిదండ్రులు కూలీపని చేసుకుంటేనే జీవనం సాగుతుంది. తండ్రి ఇటీవల అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అరవింద్‌కు ఆహారం, మందుల ఖర్చుల కోసం సాయం చేయాలని గురుకుల పాఠశాలకు వెళ్తే పట్టించుకోవడం లేదని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంచిగా చదువుకుంటాడని బావించి పాఠశాలకు పంపితే... పిల్లల చేత పనులు చేయించి... ప్రాణాల మీదకు తెస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యింది. తమకు న్యాయం చేయాలని.. భవిష్యత్తులో తమ బిడ్డకు ఆసరాగా ఉండేలా ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటోంది. అధికారులు స్పందించి... తమ కన్నబిడ్డ దుస్థితికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి వేడుకుంటోంది.

"మా బాబుకి గురుకుల పాఠశాలలో సీటు వస్తే చేర్పించాము. అక్కడ గోడ కూల్చుతూ ఇటుకలు మోయమన్నారు. గోడ కూలి మా బాబు కాలుపై పడింది రెండు చోట్ల కాలు విరిగింది. ఆపరేషన్​ స్కూల్​వారే చూసుకున్నారు. ఇప్పుడు పాఠశాలకు వెళ్తే ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. మేము కూలి చేసుకుని బతికేవాళ్లం మా బాబూ భవిష్యత్తు బాగుండాలి అంటే ఆర్థిక సహాయం చేయాలి." - మాధవి, విద్యార్థి తల్లి

Shayampet Gurukul Problems : ఒకే చోట రెండు గురుకులాలు.. వసతుల లేమితో విద్యార్థుల ఇక్కట్లు

ప్రారంభం నుంచి సార్లు లేరు.. పాఠాలు చెప్పిందీ లేదు.. మరి పాసయ్యేదెలా..?

ABOUT THE AUTHOR

...view details